హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

RR: మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులో 57 ఏళ్ల నిందితుడిని ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐపీసీ 376AB కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, పోక్సో చట్టంలోని 5(m) సెక్షన్‌ కింద మరో 20 ఏళ్ల శిక్ష విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.