హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ దుకాణాల్లో తనిఖీలు.. ఇద్దరు డీలర్లపై కేసులు

MLG: మంగపేట మండలంలోని పలు రేషన్ దుకాణాలను జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయనే సమాచారంతో జీసీసీ, ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగు రేషన్ షాపులను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను తనిఖీ చేయగా తూకాల్లో తేడాలు గుర్తించి.. ఇద్దరు డీలర్లపై కేసులు నమోదు చేశారు.