BHPL: చిట్యాల రిపోర్టర్ రవితేజపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పలువురు జర్నలిస్టులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, విధులు నిర్వహించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఎస్పీని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జర్నలిస్ట్‌పై దాడి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్


