హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డిలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

KMR: ఎస్ఐఆర్-2026లో భాగంగా ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆర్డీఓ ఆర్. ప్రభాకర్ విడుదల చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 283 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,06,342 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణ, కొత్త ఓటు నమోదుకు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.