HNK: ఎల్కతుర్తి మండలం సూరారంలో ఓ గ్రానైట్ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు హరిశంకర్ (20) సోమవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. ఐదు రోజుల క్రితమే పనిలో చేరిన ఆయన పరిశ్రమలోని ఓ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై నర్సింహారావు తెలిపారు.
తెలంగాణ
గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి బలవన్మరణం


