హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

BDK: జిల్లాలో చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా విద్యావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. సోమవారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సాధారణ పాఠశాల విద్యను కొనసాగించలేకపోయిన విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.