NZB: ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత వెల్లడించారు. వరుణ్ మోటార్స్, అపోలో, ప్రూడెన్షియల్ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
నేడు జిల్లాలో జాబ్ మేళా


