హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసేకరణ పనులు పరిశీలించిన కలెక్టర్

NDL: గుంటూరు–గుంతకల్లు రైల్వే మార్గంలో 401.47 కిలోమీటర్ల మేర చేపడుతున్న డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు సంబంధించి డోన్ మండలం డోన్ గ్రామంలో భూసేకరణ చేసిన భూములను సోమవారం సాయంత్రం కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తి అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.