హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక తరలింపు.. ట్రాక్టర్ సీజ్

KNR: వీణవంక మండలం కొండపాకలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కొలుకూరి రాజ్‌కుమార్ ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.