హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్

WGL: నల్లబెల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా మరో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పులి రమేష్ ఆరోపించారు. ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం సరికాదని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సర్పంచులపై మొండివైఖరి సరికాదని అన్నారు.