హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తిపూడి శివారులో యువకుడి కాలిన మృతదేహం!

 కాకినాడ: కత్తిపూడి శివారు పోలవరం కాలువ సమీపంలో గుర్తుతెలియని యువకుడి పాక్షికంగా కాలిన మృతదేహం సోమవారం రాత్రి వెలుగుచూసింది. మృతుడి వయసు సుమారు 25-30 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని సీఐ బి.సూర్య అప్పారావు, అన్నవరం ఎస్‌ఐ జి.శ్రీహరిబాబు పరిశీలించారు. హత్యా.. ఆత్మహత్యా అనే కోణాల్లో క్లూస్‌టీమ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.