హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టు మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ

PPM: జిల్లాలో గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ బేతా కుమారస్వామి సోమవారం మృతి చెందారు.ఈ సందర్భంగా ఆయన అకాల మరణానికి సంఘీభావంగా జర్నలిస్టులు, ప్రజాసంఘాలు సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి మౌన ప్రదర్శన చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో కొనసాగి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మన మధ్య లేకపోపోవటం బాధాకరం అన్నారు.