హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రేక్ బైండింగ్‌తో రైలు నిలిపివేత

సత్యసాయి: కొత్తచెరవులో ATP నుంచి బెంగళూరు వెళ్తున్న ప్యాసింజర్ రైలు బ్రేక్ బైండింగ్ కారణంగా సోమవారం కొద్దిసేపు నిలిచిపోయింది. కొడపగానిపల్లి-బసంపల్లి మధ్య చక్రాల వద్ద పొగ, నిప్పురవ్వలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సిబ్బంది మరమ్మతులు చేసి 20 నిమిషాల తర్వాత రైలు నడిపినా, మళ్లీ సమస్య రావడంతో నారాయణపురం స్టేషన్‌లో నిలిపి ప్రయాణికులను మరో రైలులో తరలించారు.