హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిలిచిన వర్షపు నీరు

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు భారీగా నిలిచి రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారి నీరు బయటకు వెళ్లక ఆసుపత్రి ప్రాంగణంలోనే నిలుస్తోంది. దీంతో నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.