హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపాలి'

WG: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అడిషనల్ SP విశ్వనాథ్ బాధితుల నుంచి 7 ఫిర్యాదులు స్వీకరించారు. అందిన అర్జీలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిర్దేశిత గడువులోగా చట్టపరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం తగదని ఆయన స్పష్టం చేశారు.