హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల హెచ్చరికలు బేఖాతర్.. వరి నాట్లలో రైతులు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు వద్దని అధికారులు చెప్తున్నా రైతులు వినడం లేదు. గోదావరి వరదలతో సాగునీటికి ఢోకా ఉండదనే నమ్మకంతో వైరా, పాలేరు, సాగర్ కాల్వల పరిధిలో 2.5 లక్షల ఎకరాల్లో నాట్లు ముమ్మరం చేశారు. ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని అధికారులు ఆందోళన పడుతుంటే, సాగునీటి విడుదల కోసం రైతులు లీడర్లతో ఒత్తిడి తెస్తున్నారు.