హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు చిన్నారుల హత్య.. తల్లికి జీవితఖైదు

తూ.గో: ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. 2021 అక్టోబర్ 10న రాజమండ్రి మల్లయ్య పేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.