KDP: దేవుని కడపలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 26 వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 23న వాస్తుశాంతి, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 26న మధ్యాహ్నం నుంచి స్వామివారి అంతరాలయ దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మహా సంప్రోక్షణ ఉత్సవాలు


