హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శన వేళల్లో మార్పులు

సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం దర్శన వేళలను అధికారులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి 6.45 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. 7 నుంచి 9 వరకు అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరుగుతాయి. అనంతరం 9 నుంచి 1.30 వరకు సర్వదర్శనం, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు మళ్లీ సర్వదర్శనం కల్పిస్తారు.