హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రాజేశ్వరి తెలిపారు. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.