కోనసీమ: ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు అదృశ్యం ఘటనపై DyCM పవన్ కళ్యాణ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్, SPలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మెరైన్ పోలీసు, కోస్ట్ గార్డ్ సహకారంతో అప్రమత్తంగా గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గాలింపు ముమ్మరం చేయండి: పవన్ కళ్యాణ్


