ATP: డీ హీరేహాళ్ మండలంలో కర్ణాటకకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 280 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని రాయదుర్గం స్టాక్ పాయింట్‌కు తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. అక్రమార్కులపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
280 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం


