హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదమ్ముల ఘర్షణ.. ఒకరిపై ఒకరు దాడి

WNP: శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లెలో పొలానికి సాగునీరు అందించే విషయంలో అన్నదమ్ములు ఈశ్వరయ్య, ఎల్లస్వామి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపడటంతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మన్యపురెడ్డి తెలిపారు. మోటారు నీటిని కొత్తగా కొనుగోలు చేసిన ఎకరా పొలానికి మళ్లించడంపై వివాదం తలెత్తినట్లు అన్నారు.