హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగుల పంచమి వేడకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: నాగుల పంచమి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రజల ఆయురారోగ్యాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.