హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో.. ముగ్గురికి జైలు శిక్ష

NZB: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై భీమ్‌గల్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఐదుగురు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి జైలు శిక్ష, మరో ఇద్దరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై సిహెచ్. తిరుపతి సోమవారం తెలిపారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.