హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో యువకుడు మృతి.!

KMR: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని సోనాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) గత కొంత కాలంగా మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉంటున్నారు. చంద్రశేఖర్ ఉదయం ఇంట్లో స్నానం చేయడానికి వెళ్లగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.