MHBD: మరిపెడ మండలం సోమ్లాతండాకు చెందిన కూలీ బాధావత్ భిక్య (48) విషపురుగు కాటుతో మృతి చెందాడు. ఈ నెల 16న పొలంలో కలుపు తీస్తుండగా గుర్తుతెలియని విషపురుగు కాటేయడంతో MHBD ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ SHO సతీశ్ తెలిపారు.
తెలంగాణ
విషపురుగు కాటుతో కూలీ రైతు మృతి


