హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

KMR: బీర్కూర్ పరిధిలో నల్లచెరువు కట్ట సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై సోమవారం దాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 860 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జూదానికి బానిసలై కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.