WGL: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కన్వీనర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు వినతిపత్రం సమర్పించారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి: రవి


