హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామలింగేశ్వర స్వామికి వైభవంగా ఊరేగింపు

BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న పర్వతవర్దిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక ఊరేగింపు సేవ నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి సేవా పీఠంపై కొలువుదీర్చారు. అనంతరం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.