KMM: ఏన్కూరు రైతువేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు. వ్యవసాయం, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్


