హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాగుల పంచమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు

WGL: నేడు నాగులపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశిబుగ్గలోని SRనగర్ కట్ట మీద గల నాగేంద్రస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని, స్వామికి పాలు, నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.