హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం రావాలని మోదీకి ఆహ్వానం

VSP: గోవా గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా అశోక్‌ గజపతిరాజు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. గోవా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా మోదీకి సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహూకరించి, అప్పన్న దర్శనానికి రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్‌ తరఫున ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.