హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: కంభం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో సత్తార్ తెలిపారు. సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఉర్దూ, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీ, టెట్ అర్హత కలిగిన వారు ఆగస్టు 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.