WGL: యువ క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ అకాల మరణం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఎస్ఆర్ఆర్ తోటలోని వైష్ణవ్ నివాసానికి బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైష్ణవ్ మృతి క్రీడారంగంతో పాటు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి గంట రవికుమార్ పరామర్శ


