హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం... సర్పంచ్ మృతి!

MHBD: రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన MHBD జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకంపాడు గ్రామ సర్పంచ్ సోమన్న బైక్పై వెళ్తుండగా గిరిపురం ముత్యాలమ్మ గుడి వద్ద టాటా ఏస్ వాహనం బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన సోమన్నను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు సమాచారం.