హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో యువకుడు అదృశ్యం

VZM: బొబ్బిలి నాయుడు కాలనీకి చెందిన యశ్వంత్ ఇంటర్ అనంతరం విశాఖలో డిగ్రీలో చేరి చదువు మానేశాడు. ఈ నెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి ఐఫోన్ 16, స్కూటీ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్సై సుగుణాకర్ రావు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.