హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవి పంది ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SRD: బైక్‌పై వెళ్తున్న రాఘవేంద్ర (45)ను అడవి పంది ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతారం వెళ్తుండగా మేళసంఘం శివారులో పంట పొలాల నుంచి ఒక్కసారిగా వచ్చిన పంది బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కిందపడిన రాఘవేంద్ర చెయ్యి విరిగింది. స్థానికుల సమాచారంతో కంకోల్ 108 సిబ్బంది కిరణ్, రవీందర్ ప్రాథమిక చికిత్స అందించి జిల్లా ఆస్పత్రికి తరలించారు.