హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ధర్నా'

NLG: జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు పూర్తయి రెండేళ్లు గడిచినా సుమారు రూ.11 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు. బిల్లుల విడుదల కోసం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడే నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించి, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.