హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NZB: ఖానాపూర్–గుండారం రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అలండి అనిల్ (38) మృతి చెందాడు. గుండారం నుంచి ఖానాపూర్ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్ దక్కోటే వాగమరేగా గుర్తించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.