హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యం'

SRPT: మోతే మండల పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా మోతె పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో మండలంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలు, హోటళ్లు, కిరాణా దుకాణాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు.