హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత షట్లర్లు శుభారంభం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జంట తొలి రౌండ్‌లో విజయం సాధించి రౌండ్ 32కు దూసుకెళ్లింది. ఈ జోడీ వరుస గేమ్‌ల్లో 21-9, 21-13 తేడాతో పౌలా-లూసియా (స్పెయిన్)ని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-హరిహరన్ జంట కూడా తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది.