హైదరాబాద్: 28°C
క్రీడలు

పీవీ సింధు శుభారంభం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా ఇవాళ మొదలైన ఈ టోర్నీలో సింధు తొలి రౌండ్‌లో ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్ రౌండ్ 64లో సింధు 21-7, 21-11 తేడాతో సోఫియా నోబెల్ (ఐర్లాండ్‌)ను చిత్తు చేసింది. తొమ్మిదో సీడ్ అయిన సింధు.. తొలి గేమ్‌ను సునాయాసంగా సొంతం చేసుకుంది.