CTR: ఐరాల మండలం బొమ్మసముద్రం దళితవాడలో రుద్రయ్య (42) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ గేటు వద్ద ద్విచక్ర వాహనాల మెకానిక్ షాప్ నిర్వహిస్తున్న ఆయన అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కాణిపాకం పీహెచ్‌సీకి తరలించగా, మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
అప్పుల బాధతో మెకానిక్ ఆత్మహత్య


