కృష్ణా: విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “చైతన్యం" అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. చల్లపల్లి గురుకుల కళాశాలలో సోమవారం చైతన్యం అవగాహన సదస్సు నిర్వహించారు. 18ఏళ్ల లోపు బాలికలను చట్టప్రకారం పిల్లలుగానే చూస్తామన్నారు. ఫోక్సో చట్టం బాలికలకు రక్షణ కల్పిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో చైతన్యం అవగాహన సదస్సు


