హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దామరంచలో పిచ్చికుక్కల బెడద'

KMR: దామరంచ గ్రామంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఇన్‌చార్జి కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఓ మహిళపై కుక్క దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రధాన వీధుల్లో సంచరించే వృద్ధులు భయపడుతున్నారని పేర్కొన్నారు.