PPM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, ఆర్జీదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయపరంగా ఉంటే సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై శిరీష పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ నిర్వహించిన ఎస్పీ


