AKP: నిబంధనలు అతిక్రమించిన మూడు లారీలకు భారీ జరిమానా విధించారు. నక్కపల్లి మండలం వేంపాడు వద్ద టోల్ ఫ్రీ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు స్టీల్ ప్లాంట్ రోడ్‌లో వెళుతున్న మూడు లారీలను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పరిమితికి మించి ఇసుకను తీసుకు వెళ్తున్న లారీలను రవాణా శాఖ అధికారులకు అప్పగించగా రూ. 1.66 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ మురళి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడు లారీలకు భారీ జరిమానా


