హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు

VZM: ఎస్.కోట దొర్లపాలెం జంక్షన్ వద్ద ఎస్సై నవీన్ పడాల్ సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరిని పట్టుకుని సంచులు తనిఖీ చేయగా పెద్ద కంచు గంట, చేతి గంట, రెండు దీపం కుందులు దొరికాయి. పూజా సామాగ్రి చోరీ చేసినట్లు తేలడంతో ఆ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.