NRPT: మరికల్ మండలం పూసలపాడు గ్రామంలో గుండి మల్ల వెంకట్ రెడ్డికి చెందిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మరికల్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్సై గాయత్రి తెలిపారు. అక్రమంగా బియ్యం రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత


